తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు

విశాఖ లోకల్ న్యూస్

తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు ఉత్తర నియోజకవర్గం క్లస్టర్ సమావేశంలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మరలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని  తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రివర్యులు  ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు.

 విశాఖపట్నం జిల్లా ఉత్తర నియోజకవర్గం యూనిట్ మరియు క్లస్టర్ స్థాయి సమావేశం మాజీ మంత్రివర్యులు, ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన  మంగళవారం విశాఖలో జరిగింది.  ఈ సమావేసానికి పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజుని పార్టీ అధిస్థానం నియమించింది.  ఈ సందర్బంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ   ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజల జీవన విధానం అస్థవ్యస్థంగా ఉందని అన్నారు.  అన్నివర్గాల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.  యావత్ రాష్ట్రమంతా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లి యువతకు ఉపాధి అవకాశాలు  పుష్కళంగా ఉంటాయని కోరుకుంటున్నారని  అన్నారు.   అందుకోసం  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ  సమిష్టిగా కృషి చేసి  రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటున్న ప్రజల కోరికను మనందరం  బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు.  బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇంచార్జ్ లు, క్లస్టర్ ఇంచార్జ్ లు  అందరూ ఇప్పటినుండే బాధ్యతాయుతంగా  పనిచేయాలని అన్నారు. 

ఈ  సమావేశంలో  శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు,  ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ చిక్కాల విజయ్ బాబు,  పరిశీలకులు గంటా నూకరాజు మరియు వార్డు అధ్యక్షులు,  బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.