ప్రజల పక్షాన పోరాడేది జనసేన పార్టి:పోతిన తిరుమలరావు
మధురవాడ : ప్రజల పక్షాన పోరాడేది జనసేన పార్టి అని, పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు తమ నిరసన గళాల ద్వారానే పరిష్కార మార్గం చేపడుతున్నాయని జనసేన నాయకులు పోతిన తిరుమలరావు అన్నారు. రాష్ట్రంలో పేరుకుపోయిన అనేక సమస్యలపై అధికారంలో లేకపోయినా మా నాయకుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగివచ్చి సమస్యల పరిష్కారం చేపట్టే విధంగా చర్యలు చేస్తున్నారన్నారు. తాము వినిపించేది ప్రజావాణి అని, ప్రజలకు ఏసమస్య వచ్చిన జనసేన ముందుంటుందని అన్నారు. అల్లూరి జయంతి రోజు పాండ్రంకి గ్రామంలో వంతెన నిర్మాణం కోసం భీమిలి జనసేన సమన్వయకర్త డా.సందీప్ పంచకర్ల చేపట్టిన నిరాహారదీక్షే దీనికి నిలువెత్తు సాక్ష్యమని ఆయన అన్నారు. భీమిలి శాసనసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకపోయినా ప్రజల కోసమే తాము అని గట్టిగా నమ్మిన జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ భీమిలి నియోజకవర్గంలో ప్రజా అవసరార్థమైన సమస్యలు పట్ల గట్టిగా పోరాడుతున్నామన్నారు. తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు రాష్ట్రంలో గల రహదారుల దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం తాము చేపడితే పందులు దొర్లే గుంతలకు ఫోటోలు తీసి పెడుతున్నారంటూ 6వ వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం హాస్యాస్పదమైన విషయమని అన్నారు.

