భీమిలి నియోజకవర్గం 7వ వార్డు వాంబే కాలని వావలపల్లి చిన్నా, వీరమహిళ సునీత ఆధ్వర్యంలో భారీగా జనసేన లోకి చేరిన యువకులు.
మధురవాడ :వాంబే కాలని
భీమిలి నియోజకవర్గం 7వ వార్డు వాంబే కాలని వావలపల్లి చిన్నా, వి.శ్రీను, పి.గణేష్, కె. గణేష్, ఎన్. కృష్ణ, రెడ్డి రాజు మరియు జనసేన వీరమహిళ సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ,మహిళా నాయకురాలు ఒమ్మి దేవి యాదవ్ పాల్గొనడం జరిగింది. కాలనీ సమస్యల పై ప్రజలను అడిగి తెలుసుకుని, జనసేన పార్టీ తరపున వారి పక్షాన పోరాడుతామని సందీప్ తెలపడం జరిగింది. వాంబే కాలనీ జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీలో అధిక సంఖ్యలో ప్రజలు చేరడం జరిగినది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 7వ వార్డు నాయకులకు, వాంబే కాలనీ జనసైనికులకు,ప్రజలకు,వీరమహిళలకు హృదయ పూర్వక అభనందనలు. ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ నాయకులు నాగోతి నాయుడు , యాళ్ల విజయ్, సాగర్ మ వుళ్ల,5వ వార్డ్ నాయకులు యెడ్ల గణేష్ 2వా వార్డ్ నాయకులు శంకర్ రెడ్డి పాల్గొ
న్నారు.

