ఒంగోలు జాతి పశుపోషణపై రైతులకు అవగాహన సదస్సు,మరియు శిక్షణా కార్యక్రమం
భీమిలి ఆనందపురం మండలం,కోలవానిపాలెం గ్రామ పంచాయతీ లో పశు గణాభివృద్ది సంస్ద EO. శ్రీ B రామ్మోహన్ రావు అధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలలో భాగంగా ఒంగోలు జాతి పశు పోషణపై రైతులకు అవగాహనా సదస్సు, మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన DLDA చైర్మన్ గాడు వెంకటప్పడు విచ్చేసి మాటడుతూ ఒంగోలు జాతి ఆవులు పెంపకం పై రైతులు అవగాహన పెంచుకొని పాల ఉత్పత్తి ఎక్కవ రావడానికి కృషి చేయాలన్నారు .అలాగే 45 ఒంగోలు జాతి పశువులకు గర్బకోశ చికిత్స లు నిర్వహించి, ఉచితంగా నట్టలు నివారణ మందులు,ఖనిజ లవణ మిశ్రమం అందజేయడం జరిగింది అని చెప్పారుఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ పప్పలచలపతమ్మ గారు, యువనాయకులు నీలాపు సూర్యనారాయణ గారు, విశాఖపట్నం డివిజన్ ఉప సంచాలకు డాక్టర్ N.కరుణాకరరావు గారు,FSBS ఉప సంచాలకులు డాక్టర్ N.చంద్రశేఖర్ గారు చిన్నగదిలి AO డా S.శ్రీనివాసరావు గారు మండల పశు వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు డా భానుబాబు , స్థానిక పంచాయతి పెద్దలు,పంచాయతి కార్యదర్శి గారు , సహాయ సిబ్బంది మరియు రైతులు పాల్గున్నారు!

