మధురవాడ లో కిలాడి లేడీ:భర్తను చంపి అ తరువాత కనిపించడం లేదని పిర్యాదు చేసిన కిలాడి లేడీ


మధురవాడ లో కిలాడి లేడీ:భర్తను చంపి అ తరువాత కనిపించడం లేదని పిర్యాదు చేసిన కిలాడి లేడీ.

మధురవాడ:

మధురవాడ లో మిస్పింగ్ కేసును చేదించిన పోలీసులు అది మిస్పింగ్ కాదు హత్య అని తెల్చారు. ప్రియుడు తో కలిసి భర్తను చంపి అ తరువాత కనిపించడం లేదని పిర్యాదు చేసిన లేడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రెండు రోజులు క్రితం మారికవలస జాతీయ రహదారిపై బ్రిడ్జి కింద గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా పాడైపోయి గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో మృతుడు ఎవరనేది తెలుసుకోవడం కోసం పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన మిస్సింగ్ కేసులో వ్యక్తి మృతి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.