జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్.
హైదరాబాద్:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. దీంతో షూటింగ్లకు వెళ్లకుండా హైదరాబాద్లో ప్రస్తుతం పవన్ తన నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్కు వైరల్ ఫీవర్ వచ్చిన నేపథ్యంలో ఈ నెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసినట్లు జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

