ప్రభుత్వం తీసుకు వచ్చిన జి ఓ 117 ను రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాలల ముందు నిరసన.

 ప్రభుత్వం తీసుకు వచ్చిన జి ఓ 117 ను రద్దు చేయాలని  ప్రాథమిక పాఠశాలల ముందు నిరసన.


భీమిలి నియోజకవర్గం:

ప్రభుత్వం తీసుకు వచ్చిన జి ఓ 117 ను రద్దు చేయాలని భీమిలి జనసేన పార్టీ నాయకులు గుడివాడ.కిరణ్, నవిరి.రాజు, వెంకటేష్ హేమంత్, రాజు మరియు జన సైనికులు పాల్గొని భీమిలి మండల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ముందు నిరసన తెలియజేశారు... ఈ సమస్యను జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంఛార్జి సందీప్ ద్వారా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకు వెళ్లి ప్రాథమిక పాఠశాల లను కాపాడేలా జనసేన పార్టీ ద్వారా పోరాడతామని తెలిపారు.మండలంలోని మజ్జిపేట , తాటితురు , చిప్పాడ , పైలపేట , అవనం , మంగమారిపేట లలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను హై స్కూల్ లో కలిపిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయా పాఠశాల ల ముందు నిరసన తెలిపి శుక్రవారం నాడు ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా కలిసి నిరసన తెలియజేస్తామని ఈ సమస్య పై జనసేన పార్టీ పోరాడతుందని తెలిపారు.