ఏ. సి. పి., చైన్ మాన్ అండతో రెచ్చిపోతున్న బిల్డర్లు...దాని జోలికి వెళ్లవద్దని ఏ. సి. పి. అన్నారని చెబుతున్న ప్లానింగ్ సెక్రటరీ..
విశాఖ లోకల్ న్యూస్:
విశాఖలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. వారికి అండగా మహా విశాఖ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కొమ్ము కాస్తున్నారు... తీసుకున్న ప్లాన్ ఒకటి.... నిర్మాణం చేస్తున్న ప్లాన్ ఒక్కటి. మహా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ జోన్5 లో మరీ విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ నిర్మాణంలో ఉన్న భవనాలపై పర్యవేక్షణ లోపం వల్ల రియల్టర్లు లాభపడుతూ, జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు... ఇలా జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టడంలో ఏ. సి. పి. అరుణ వల్లి కీలక పాత్ర పోషిస్తున్నారు. వార్డు లో జరుగుతున్న నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలను ఎత్తిచూపి అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన చైర్మన్ ప్రసాద్ తనపని తాను సక్రమంగా నిర్వహించకుండా ఎక్కడెక్కడ తీసుకున్న ప్లాన్లకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు చూసి ఏ. సి. పి. దృష్టికి ముందుగా తీసుకెళ్తాడు. అమ్మ మిమ్మల్ని వచ్చి ఒక సారి కలవామన్నారు అని బిల్డర్ కి చెప్పి విషయాన్ని సాగాదిస్తూ ఉంటారు. విషయం బిల్డర్ కి అర్థమయ్యే విధంగా ప్రవర్తించి అనుకున్న ప్యాకేజీ వచ్చేటట్లు చేసుకుంటారు. లోకల్ ప్రెస్ వారిని, స్థానిక కార్పొరేటర్ ని చూసుకోవాలి అని ఉచిత సలహా ఇస్తారు. ఒకవేళ ఎవరైనా పేపర్ లో వార్త రాస్తే మేము వచ్చి చిన్న కన్నం పెట్టి వెళ్లిపోతామని వరకు అభయం కూడా వీరే ఇచ్చేస్తారు. అచ్చు ఇలానే జరిగింది జీవీఎంసీ జోన్5 పరిధి వార్డు నెంబర్ 52 పాత కరసా ,ఏసుబాబు వీధిలో బిల్డర్ ఆచార కడుతున్న బిల్డింగ్ పరిస్థితి. ఆయన తీసుకున్న ప్లాన్ కి అదనంగా మరో అదనపు అంతోస్తూ. స్థానిక సచివాలయం లో ప్లానింగ్ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న కుమారి దానిని గ్రహించి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అభయహస్తం ఇచ్చిన ఏ. సి. పి. సూచన తో చైన్ మాన్ ప్రసాద్ ఒక చిన్న కన్నం పెట్టి మామా అనిపించారు. ఇప్పుడు ఆ బిల్డర్ మరల పని ప్రారంభించి శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆషాడ మాసం లో పని పూర్తి చేసి వచ్చే శ్రావణ మాసంలో గృహప్రవేశం కి చక చక ఏర్పాటు జరుగుతున్నాయి. దీనిపై సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ కుమారి ని మరల పనులు జరుగుతున్నాయి అని అడిగితే దాని కోసం నన్ను అడగవద్దు అని దానిని ఏ. సి. పి. మేడమ్ స్వయంగా చూసుకుంటున్నారు అని ఆమె సమాధానమిచ్చారు. ఏ. సి. పి. కి ఫోన్ వారం రోజులు నుంచి ఫోన్ చేయగా కనీసం స్పందించలేదు. పోనీ తన వాట్సప్ కి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. అదే పంథా చైన్ మాన్ ప్రసాద్ కూడా పాటిస్తున్నారు. ఫోన్ కి స్పందించలేదు, ఫోన్ తీయటం లేదు... ఇలాంటి వాటిని అరికట్టి జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని యువజన సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

