అజాతశత్రువు డా. ఎమ్. వి. వి. ఎస్. మూర్తి..!


 భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

అజాతశత్రువు డా. ఎమ్. వి. వి. ఎస్. మూర్తి..జయంతి వేడుకల్లో భీమిలి ఇంచార్జ్ కోరాడ రాజబాబు 


         విద్యా కుసుమం, రాజకీయ అజాతశత్రువు డా. ఎమ్. వి. వి. ఎస్. మూర్తి అని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు అన్నారు.


            తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, గీతం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు స్వర్గీయ  ఎమ్. వి. వి. ఎస్. మూర్తి   84వ జయంతిని పురష్కరించుకొని భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు సమక్షంలో  జయంతి వేడుకలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన  నియోజకవర్గం ఇంచార్జ్  కోరాడ రాజబాబు    కేక్ కట్ చేసి  శుభాకాంక్షలు తెలియజేసారు.  అనంతరం మీడియాతో  కోరాడ రాజబాబు మాట్లాడుతూ    మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి  ( ఎమ్. వి. వి. ఎస్. మూర్తి )   3 జులై 1938వ సంవత్సరంలో జన్మించారని అన్నారు. విశాఖపట్నం ప్రజలకు గోల్డ్ స్పాట్ మూర్తిగా పరిచయం అయిన స్వర్గీయ  ఎమ్. వి. వి. ఎస్. మూర్తి   వ్యాపారం చేస్తూ రాజకీయాలమీద మక్కువతో ప్రజా సేవ చేయాలనే శంకల్పంతో  తెలుగుదేశం పార్టీలో చేరి  విశాఖపట్నం పార్లమెంట్ సభ్యునిగా ప్రజలచేత ఎన్నుకోబడి  జిల్లా ప్రజలకు ఎనలేని సేవ చేశారని అన్నారు.   పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సేవలో మాత్రం ఎక్కడా తగ్గకుండా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలoదించారని చెప్పారు.  తెలుగుదేశం పార్టీ నుండి 2014లో శాసనమండలి సభ్యునిగా కూడా ఎన్నికయి ఉదార స్వభావాన్ని చాటుకున్న గొప్ప దార్షనికుడు   స్వర్గీయ మూర్తి అని కొనియాడారు.  విశాఖపట్నం ఋషికొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గీతం కాలేజ్ ని  విశ్వవిద్యాలయంగా మార్చి  ఎంతోమంది విద్యార్థులకు  విద్యాధానం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి డా. ఎమ్. వి. వి. ఎస్ మూర్తి అని చెప్పారు. 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు మాట్లాడుతూ  ఎటువంటి విమర్శలు లేకుండా ఎంతో హుందాగా రాజకీయాలు చేసి ఏ పార్టీ వారైనా  సాయం కోసం వస్తే అక్కున చేర్చుకొని సహకారం అందించిన గొప్ప మనసున్న నేత డా. మూర్తి  అని చెప్పారు. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ( గీతం) ను విశ్వ విద్యాలయంగా మార్చి ఎంతోమంది  విద్యార్థులకు  విద్యను అందించిన గొప్ప దార్సనికుడు  మూర్తి అని చెప్పారు.  ఎప్పుడూ నవ్వుతూ అందరిని పేరుపెట్టి పిలిచి ప్రేమగా మాట్లాడేవారని అన్నారు.  విశాఖపట్నం పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తరువాత ఈ జిల్లా ప్రజలపై అమితమైన  ప్రేమను కనబర్చి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని గంటా నూకరాజు అన్నారు.  అలాంటి నేత బౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన చేసిన ప్రజా సేవ ప్రతీ హృదయంలో నిలిచి ఉంటుందని చెప్పారు.  డా. మూర్తి జయంతిని పురష్కరించుకొని  నేరళ్లవలసలో  ఉన్న శ్రీ సాయి సద్గురు ఆశ్రమంలో  వృద్దులకు భోజనం ఏర్పాటు చేయడమైనదని గంటా నూకరాజు అన్నారు. ఈ  కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు పెంటపల్లి యోగీశ్వరావు, మారోజు సంజీవకుమార్, అప్పికొండ నూకరాజు, కొక్కిరి అప్పన్న, కే. ఎస్. ఆర్. కృష్ణారావు,  వియ్యపు పోతురాజు,  వాడమొదలు రాంబాబు, లక్ష్మణరావు, తాతారావు, వాసుపల్లి వంశీ  తదితరులు పాల్గొన్నారు.