7వ వార్డు లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ:భారీగా జనసేనలో చేరిన యువకులు.

7వ వార్డు లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ:భారీగా జనసేనలో చేరిన యువకులు.

మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్ :

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికుల క్షేమం కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గo 7వవార్డు జనసైనికులకు. క్రియాశీల సభ్యుత్వం తీసుకున్న వారికీ జనసేన 7వ వార్డు నాయకులు ఈనాడు నాయుడు ఆధ్వర్యంలో.జనసేన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ డా"సందీప్ పంచకర్ల,జనసేన రాష్ట్ర జెనరల్ సెక్రెటరీ శివ శంకర్ చేతులు మీదుగా అందించారు.

ఈ కార్యక్రమంలో డా సందీప్ పంచకర్ల మాట్లాడుతూ ప్రజా సమస్యలు పై పోరాడే వ్వక్తి పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ అధికారం లో లేకపోయినా అన్ని రకాల ప్రజలు కన్నీరు aa


అని అన్నారు.కౌలు రైతులు కుటుంబలకు 30 కోట్లు రూపాయలు ఇస్తున్న జనసేన పార్టీ లో ఉన్నందుకు మనం అందరూ గర్వపడాలి అని తెలియజేసారు.ఒక్క భీమిలి నియోజకవర్గం లోనే క్రియా శీల సభ్యత్వంలో నమోదు చేసుకున్న సభ్యులకు 5లక్షలు చొప్పున ఇద్దరికీ, కాళ్ళు,పోయిన సభ్యుడుకు 50,000, చేతులు పోయిన సభ్యునికి 11,000రూపాయలు అందించారని తెలిపారు.

జనసేన రాష్ట్ర జెనరల్ సెక్రెటరీ శివ శంకర్ మాట్లాడుతూ ఒక్కో జనసైనికుడు ఒక్కో పది మందికి జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ ని గెలిపించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు వచ్చే విధంగా కష్టపడాలని తెలిపారు. జనసేన నాయకులు కు వ్యక్తిగత స్వార్ధం లేదని అటువంటి నాయకులు జనసేన అధినేత ఆశయాలను నచ్చి పనిచేస్తున్నారని తెలిపారు.

 బి.వి కృష్ణయ్య పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆయన పై నమ్మకంతో  జనసేన మరింత బలం తో జనసేన  ముందుకు సాగుతుందని అన్నారు.జనసేన నాయకులు , మాట్లాడుతూ మహిళలు పై దాడులు పెరిగిపోయాయి అని విశాలమైన విశాఖపట్నం లో మహిళలు పై దాడులు జరుగుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని పబ్లిసిటీ చేసుకోవటానికి మాత్రం ముందుంటున్నారని అన్నారు.

పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ  పవన్ కళ్యాణ్ ని సి ఎమ్ గా చేసేవిధంగా కష్ట పడాలని తెలిపారు.

7వ వార్డు జనసేన నాయకుడు ఈనాడు నాయుడు మాట్లాడుతూ 7వార్డు ప్రజలకు అన్నివిధాలా పవన్ కళ్యాణ్ ప్రతి జనసైనికుని కి ఒక భరోసా ఉండాలనే ఆలోచన తో జనసేన క్రియాషీలా సభ్యత్వం ప్రవేశపెట్టి గతంలో 7వ వార్డు త్రినాధ్ అనే జనసైనికుడు మరణించిన తరువాత ఆయన కుటుంబానికి నేను ఉన్నాను అని 5లక్షల చెక్కుని ఆకుటుంబానికి అందచేసిన విషయాన్ని గుర్తుచేసారు. మల్లయ్యపాలెం లో సుమారు 30 మంది యువ జన సైనికులు చేరారు. రానున్న రోజుల్లో అన్ని ఏరియాల నుండి జనసైన్యంలో చేరటానికి ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు.

6వ వార్డు పోతిన అనురాధ మాట్లాడుతూ ప్రతీ ఒక్క జనసైనికుడు ఒక జనసేన గెలుపుకు ప్రతీ కుటుంబంలో పెద్దలకు పవన్ కళ్యాణ్ ఆశయాలను తెలిపి ఆయన గెలుపుకు కృషి చెయ్యాలని తెలిపారు.

5వ వార్డు ఎడ్ల గణేష్ యాదవ్ మాట్లాడుతూ  చెత్త పన్ను వేసే చెత్త ప్రభుత్వం లో ఉన్నామని ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని జనసైనికులు ప్రతీ కుటుంభంలో చైతన్యం తీసుకురావాలని అన్నారు.

పోతిన త్రినాథరావు వైస్సార్సీపీ పార్టీ నుండి శివశంకర్, సందీప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్యులపై చెత్త పన్ను, ఆర్టీసీ చార్జీలు పెంపు, విద్యార్థుల బస్సు పాసుల పై భారం వేసి ప్రజలు పై నిత్యావసర ధరలు ఆకాశన్నంటే విధంగా ఉన్నాయని ఈ ప్రభుత్వంకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేవిధంగా జనసైనికులు ఒక సైన్యం గా ఉన్నారని జనసేన ఆశయాలు నచ్చి జనసేన లో చేరారని అని అన్నారు.

ఈ కార్యక్రమం లో సంతోష్ నాయుడు, నాని, రాష్ట్ర చేనేత విభాగం ఉపాధ్యక్షులు ప్రియాంక బరాటం, త్రినాధ్,జనసేన నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.