తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు మీ కుటుంబానికి భరోసా:కార్పోరేటర్ పిల్ల మంగమ్మ


  భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు మీ కుటుంబానికి భరోసా:కార్పోరేటర్ పిల్ల మంగమ్మ

జీవీఎంసీ జోన్ టు మధురవాడ 7వ వార్డ్ లో  వాంబేకొలని మరియు స్వాతంత్ర నగర్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ,నాయుడు ,మరియు లోకేష్ బాబు ఆదేశాల మేరకు కార్పోరేటర్ పిల్ల మంగమ్మ వెంకరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్రియా శీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ పిల్ల మంగమ్మ వెంకటరావు  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రతి పసుపు సైనికుడు నమోదు చేసుకోవాలని ,క్రియా శీలక సభ్యత్వం నమోదు చేసుకోవటం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మీ కుటుంబానికి ప్రమాద బీమా రూపంలో  మీ కుటుంబానికి అండగా ఉంటుందని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టారని దీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ తెలిపారు... ఈ కార్యక్రమంలో పిల్ల. నరసింగరావు, కనూరి.అచ్యుత్ రావు,నాగోతి. సూర్యప్రకాష్, పోతిన సోంపాత్రుడు,మామిడి. దుర్గారావు, పిసా చిన్న తదితరులు వాంబేకొలని నాయకులు పాల్గొన్నారు....