22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిరాహార దీక్షకు పలువురు సంఘీభావం.

22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిరాహార దీక్షకు  పలువురు సంఘీభావం.

విశాఖ లోకల్ న్యూస్ :

ప్రజా స్వామ్య బద్ధంగా ప్రజలు చే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కార్పోరేటర్లను కాదని , అధికార పార్టీ ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్ ను తప్పించి ఓడిపోయిన వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద పీట వేస్తూ గెలిచిన ప్రతిపక్ష సభ్యులును అవమానిస్తున్న అధికారుల తీరుకు నిరసనగా గత మూడు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న 22 వ వార్డు జనసేన కార్పొరేటర్ *పీతల మూర్తియాదవ్* కు సంఘీభావంగా ఆదివారం జనసేన ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ , తెలగుదేశం పార్టీ 27వ వార్డ్ కార్పొరేటర్ గొలగాని బుజ్జి , జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి, శ్రీనివాస్ పట్నాయక్, తెలుగు లక్ష్మి, శార్నిదేవి, తెలుగు అర్జున్, పొతు ప్రసాద్, దేవర రఘు, ఆమ్ఆద్మి పార్టీ సభ్యులు దీక్ష లో పాల్గొన్నారు .అధికారి పార్టీ అవలంభిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వీరంతా ఖండించారు .