జీవీఎంసీ ఏడవ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం.

 జీవీఎంసీ ఏడవ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం.

విశాఖ లోకల్ న్యూస్:

భీమిలి నియోజకవర్గం పరిధి జీవీఎంసీ ఏడవ వార్డు స్వతంత్ర నగర్ మరియు మార్కెట్ ప్రాంతంలో ఏడవ వార్డ్ అధ్యక్షులు పిల్ల నర్సింగరావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలు పై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ ప్రజల్ని ఏరకంగా పీడిస్తున్నారో వివరంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి వారి భవిష్యత్తు కోసం ఈసారి వచ్చే ఎలక్షన్లలో ఓటేయాలని పాలిచ్చే ఆవుని వదిలి తన్నే ఎద్దు లను తెచ్చుకుని గత ఎన్నికలలో చేసిన తప్పుని పునరావృతం చేయకూడదని ప్రజలకు తెలియజేస్తూ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహ కార్యదర్శి పిల్లా వెంకట్రావు ఏడవ వార్డ్ సెక్రెటరీ కానూరి అచ్యుతరావు సీనియర్ నాయకులు నాగోతి సూర్య ప్రకాష్ ఏడవ వార్డ్ ఉపాధ్యక్షులు పోతిన సోంపాత్రుడు బీసీ సెల్ అధ్యక్షుడు పోతిన బుజ్జి స్వతంత్ర నగర్ నాయకులు వాసుపల్లి బండయ్య సురేష్ జోగేష్ పాత్రో తదితర నాయకులు పాల్గొన్నారు.