స్పందించని యంత్రాంగం: చెరువును తలపిస్తున్న తగరపువలస ప్రాంతంలో హైవేకి రోడ్డు ఇరువైపులా వర్షం నీరు,
తగరపువలస:
తగరపువలస ప్రాంతంలో హైవేకి రోడ్డు ఇరువైపులా వర్షం నీరు, కాలువల మురుగునీరు రోడ్లపై నిలిచి చెరువును తలపిస్తూ ఉన్నాయి. అయినా కూడా అధికారుల చర్యలు ఏమీ లేవు. స్పందించని అధికార యంత్రాంగం.రోడ్లపై నిలిచి ఉన్న మురికినీటిలోనే వాహన చోదకులు, పాదచారులు వెళ్ళాల్సిన పరిస్థితి, అటువైపుగా వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలువల్లో వెళ్లాల్సిన మురికి నీరు రోడ్లపై నిలిచి ఉండడం వల్ల ఆ నీటిలోనే ప్రజలందరూ నడిచి వెళ్ళటం కారణంగా రోగాలు బారిన పడతారేమో అని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులు గత వారం రోజుల నుంచి కనిపిస్తున్న యంత్రాంగం తక్షణ చర్యలు కింద కనీసం రోడ్డుపై ఉన్న నీటిని కూడా తొలగించి రోడ్లను శుభ్రం చేయడం లేదు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి తగరపువలస నుండి వలందపేట వరకు హైవేకి ఇరువైపులా మురుగునీరు పోవడానికి సరైన ప్రణాళికతో మురుగునీరు పోయే కాలువలు నిర్మించి ఔట్ ఫ్లో నిర్మిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లపై నిలిచి ఉన్న నీటిని తొలగించడానికి తక్షణచర్యలు చేపట్టి, శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు చేసి ప్రజలకు ఆరోగ్య ఇబ్బందులు రాకుండా చేయాలని పిట్ట సురేష్ పార్లమెంటరీ సెక్రటరీ కోరుతున్నారు.


