మున్సిపల్ కార్మికుల పై నిర్భంధం ఆపాలి.సీఐటీయూ

మున్సిపల్ కార్మికుల పై నిర్భంధం ఆపాలి.సీఐటీయూ..

మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్ 

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి సమ్మె విరమింప చేయకుండా, ఈ నిర్బంధాన్ని ప్రయోగించడం సరైనది కాదని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ హితవు చెప్పింది.మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోర్కెలతో అనేక సార్లు విన్న వించుకుంటు వస్తున్న సమస్యలు పరిష్కారం చేయకపోగా జితాలలో కోత పెట్టే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం అన్యాయమని అన్నారు. సోమవారం నుండీ మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం సమ్మె  లోకి నెట్టింది.ఈ సందర్భంగా మధురవాడ జోన్ లో 5,6,7,8 వార్డులలో  ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా వాహనాల యార్డ్ వద్దకు కార్మికులు తెల్లవారి 5 గంటల నుండి చేరుకున్నారు.పెద్దపెట్టున నినాదాలు చేశారు.వాహనాలు బయటకు రాకుండా గేటు వద్ద బైఠాయించారు. 

ఈ సందర్భంగా సాయి ప్రియ లే అవుట్,మారిక వలస వద్ద సి ఐ టి యు నాయకులు డీ అప్పలరాజు,పి రాజు కుమార్, మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను జటిలం చేసి,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని అన్నారు.కార్మికులు గొంతమ్మ కోర్కెలు కోరడం లేదని అన్నారు. ఇది వర్షా కాలం కాబట్టి చెత్త పేరుకు పోయి,మురిగి పోయి ప్రజల కు సమస్యగా మారుతుంది అని,కాబట్టి ఆ పరిస్థితి రాకుండా వెంటనే కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలపట్ల,కార్మికుల పట్ల ఏ మాత్రం భాద్యత వున్న ప్రభుత్వం పస్కారం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యంలో జి కిరణ్,సి హెచ్ శేషు బాబు,కే నాగరాజు, జి విజయ, కే పైడి రాజు,వి సంధ్య,ఎం సుశీలమ్మ, కే కొండమ్మ,నరేంద్ర,ఏ మాధవ,వి చిన్న,తదితరులు పాల్గొన్నారు.