స్వతంత్రనగర్ షిరిడిసాయి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.
స్వతంత్ర నగర్ :విశాఖ లోకల్ న్యూస్
ప్రత్యేక పూజలు నిర్వహించిన 7వ వార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ ,పిళ్లావెంకట్రావు దంపతులు. మధురవాడ: ఎంతో విశిష్టత కలిగిన శుభ పర్వదినం గురుపౌర్ణమి పురస్కరించుకొని జీవీఎంసీ 5,7వార్డుల పరిధి స్వతంత్రనగర్ లో గురుపౌర్ణమి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శిరిడిసాయి దేవాలయంలో బుధవారం నాడు ఉదయం ఐదు గంటలకు కాకడ హారతి ఉదయం 6:30 గంటలకు స్వామి వారి విశేష పంచామృతాభిషేకం 108పాల ప్యాకెట్ తో బాబాగారికి అభిషేకం భక్తులచే ఘనంగా నిర్వహించారు.ఉదయం తొమ్మిది గంటలకి సర్వదర్శనం తదుపరిఅభిషేకాలు ప్రసాదవితరణ ఘనంగా జరిగాయి.ఆలయ ప్రధాన అర్చకులు అధికార్ల కాళిదాసు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో 7వ వార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ ,పిళ్లావెంకట్రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పూజా అనంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ మాట్లాడుతూ.. ఆలయంలో పలురకాలపూలతో అలంకరణ చేసి,పండ్లు,వివిధ రకాల రకాల పిండి పదార్ధాలతోస్వామి వారికి ప్రసాదములు సమర్పించడంతో.. ఆలయం కనుల విందుగా వుందని అన్నారు.అందరూ ఆయురారోగ్యాలతో , సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.స్థానిక ముఖ్య నాయకులు టీడీపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,మాజీ కార్పొరేటర్ పోతినహనుమంతరావు,7వ వార్డు వైయస్సార్ సి.పి. అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు,నాగోతి సత్యనారాయణ(జపాన్), అల్లాడ లింగేశ్వరరావు,భాగధి లక్ష్మణరావు,వాండ్రాశి అప్పలరాజు, కనకదుర్గ ఈవెంట్స్&సప్లయర్స్ కోర్రయిసురేష్,సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్ళకృష్ణమూర్తి పాత్రుడు,పోతిననానాజీ ఆలయ కమిటీ అధ్యక్షులు ఉగ్గిననాగరాజు,కార్యదర్శి లోలుగురమేష్ నాయుడు.గౌరవ సలహాదారులు పొలిమాటి సునీల్ కుమార్,కోశాధికారి జీలకర్ర గణేష్.ఉపాధ్యక్షులు కరకాని ఈశ్వరరావు.ఉప కార్యదర్శి శివ.ఉపకోశాధికారి దత్తిహరి.కమిటీ సభ్యులు కెల్లా చిన్న.లోవరాజు.ప్రశాంత్.మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

