ఏఐసిటిఈ అప్పీలేట్ అథారిటీ చైర్మన్ గా జిఎస్ఎన్ రాజు
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం:రాడార్ ఇంజనీరింగ్ విద్యలో రాజు అగ్రగామి: ఘనము గా సత్కారం.
మద్దిల పాలెం.
ఆంధ్ర విశ్వకళా పరిషత్ మాజీ ఉప కులపతిసెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సేవలందిస్తున్న ఆచార్య జీఎస్ఎన్ రాజుకు కేంద్ర ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది.. ఈ మేరకు తాజాగా (ఏఐసీటీఈ) ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్పిలేట్ అథారిటీ చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం రాజు ను నియమించింది.. రాడార్.. ఇంజనీరింగ్ విద్యలో జిఎస్ఎన్ రాజు అగ్రగామిగా అనేక పరిశోధనలతో పాటు నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు.. ఇంజనీరింగ్ విద్యార్థులు కోసం ఎన్నో పుస్తకాలు రాసిన ఘనత ఆయన సొంతం. ఈ మేరకు పదో సారి ఆచార్య
జిఎస్ఎన్ రాజు ను ఛైర్మెన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించడం అభినందనీయమని రాష్ట్ర నిరుద్యోగ సంఘము జేఏసి అధ్యక్షుడు , విద్యార్థి సంఘం నాయకుడు సమయం హేమంత్ కుమార్.. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.. ఆదివారం ఇక్కడ జిఎస్ఎన్ రాజు ను ఆయన నివాసంలో పలువురు మర్యాద పూర్వకంగా కలుసుకున్న అనంతరం ఘనంగా సత్కరించారు. అప్పన్న జ్ఞాపికను.. ప్రసాదాలు ను శ్రీనుబాబు బహోకరించారు..ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నగరానికి చెందిన జిఎస్ఎన్ రాజుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పటికి పది సార్లు అప్పిలేట్ అథారిటీ చైర్మన్ గా నియమించడము గర్వకారణమన్నారు. విద్యా వేత్తగా ఆచార్య జిఎస్ఎన్ రాజు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆయనను గవర్నర్ గా నియమించాలని వీరు ఆకాక్షించారు . దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సామర్ధ్యాల పెంపునకు ఈ కమిటీ సలహాలు సూచనలు ఇస్తుందనీ రాజు తెలిపారు. అంతే కాకుండ తగిన అనుమతులు కోసం విశ్వ విద్యాలయం లు ,ఇంజ నీరింగ్ కళాశాలలు కూడ యెటువంటి అభ్యంతరాలు ఎదురైనా తమను సంప్రదించాల్సి (అప్పీ లేట్) ఉంటుందన్నారు. తన సేవలను గుర్తించి కేంద్రము ఈ అవకాశం కల్పించడము సంతోషము గా ఉందన్నారు. తనను సత్కరించడం అరుదైన గౌరవం గా భావిస్తానన్నారు.. ఈకార్యక్రమం లో ఏ పి నిరుద్యోగ జె ఏ సి రాష్ట్ర అధ్యక్షులు,విద్యార్థి నాయకులు,సమయం. హేమంతకుమార్, జాతీయ జర్నలిస్ట్ ల అసోసియేషన్ కార్యదర్శి అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల. శ్రీనుబాబు, సనపల. తిరుపతి రావు, అక్కబత్తుల. గిరీష్, సూరిశెట్టి. శ్రీనివాసరావు, ఇండ్రపు. ఆనంద్, తదితరులు పాల్గొన్నారు

