5వ వార్డులో భారీ సంఖ్యలో టి.డి.పి. సభ్యత్వనమోదు ప్రక్రియ.
మధురవాడ:
మధురవాడ: జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజక వర్గం ఇంఛార్జి కోరాడ రాజాబాబు,వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆదేశాలతో..,వైఎస్సార్ కాలనీ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి వాండ్రసి అప్పలరాజు ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.గుర్తింపుకార్డులు త్వరలోనే అందిస్తామని తెలిపారు.వాండ్రసి అప్పలరాజు మాట్లాడుతూ..పార్టీ నాయకులు,కార్యకర్తలందరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని,పార్టీ సభ్యత్వంతో పాటు రెండు ఏళ్ళ వరకు ప్రమాద భీమాఉందని,ప్రతి సభ్యుత్వనికి 2లక్షల రూపాయుల ప్రమాద భీమా వర్తించడం జరుగుతుందన్నారు.కార్యకర్త లంతా నిత్యం ప్రజలతో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టి తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. కార్యక్రమంలో వార్డ ఎస్సిసెల్ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్ (పొట్టిప్రసాద్), సెక్రటరీ ఈగలరవి,ఓలేటి శ్రావణ్,మొకర రవి, సత్యనారాయణ,నూకరాజు, మోహనరావు,హరికృష్ణ ,రవి, రాజు,మదీనా,విష్ణు,మాధవ, అనురాధ,సత్యవతి,అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేసుకున్నారు.

