హాస్పిటల్ సిబ్బంది వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పి .గణబాబు.
30 పడకల ఆసుపత్రి గోపాలపట్నం లో హాస్పిటల్ సూపరడెంట్ డాక్టర్ . శ్రీనివాస్ఆధ్వర్యంలో పూర్వం సూపరిండెంట్ గా పనిచేసిన డాక్టర్ .జగదీష్ బదిలీ అయ్యారు మరియు డాక్టర్ .శాంతాప్రభ(గైనకాలజిస్ట్) పాడేరు డి ఎమ్ హెచ్ ఓ గా పదోన్నతి లో బదిలీ అయ్యరు మరియు హాస్పిటల్ సహచర సిబ్బంది మొత్తం 11మంది సిబ్బంది ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన సందర్భంగా. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు
పి .గణబాబు హాస్పిటల్ సిబ్బంది వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గతంలో సిబ్బంది చేసిన సేవలను కొనియాడుతూ వారందరికీ దుశాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం నందు హాస్పిటల్ కమిటీ మెంబర్ కంపరా ఆనంద్ మరియు నూతన హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

