వంగవీటి మోహన్ రంగా మీద అభిమానాన్ని రక్తదానం ద్వారా చాటుకున్నారు:వంగవీటి మేఘనాథ్
వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగాదేశపాత్రుని పాలెంలొ రక్తదాన శిబిరానికి భారీ స్పందన
పరవాడ, జూలై 3, విశాఖ లోకల్ న్యూస్
వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా 79 వ వార్డు దేశపాత్రుని పాలెం లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి వంగవీటి మేఘనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దేశపాత్రునిపాలెం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చి వంగవీటి మోహన్ రంగా మీద అభిమానాన్ని రక్తదానం ద్వారా చాటుకున్నారు. ఈ కార్యక్ర మంలో మచ్చ శివ కుమార్, బొండా లీలా కృష్ణ, శనివాడ ప్రకాష్ కరణం అప్పారావు, పిల్ల శివకృష్ణ, ఎన్. వినోద్ మరియు ఏవి. రామా రావు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

