బూస్టర్ డోసు వేసుకోవాలి: కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం : విశాఖ లోకల్ న్యూస్
కరోనా పై అందరూ అప్రమత్తంగా ఉండాలని వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. వేములవలస గ్రామంలో ఏర్పాటుచేసిన బూస్టర్ డోస్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికి అందరికీ అవసరం అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలడం తో కరోనా కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం పంచాయతీలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు నవీన్ జ్ఞానేశ్వర్ తెలిపారు. అందరూ బూస్టర్ డోసు వేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పూల మార్కెట్ ఆశీల్ కాంట్రాక్టర్ కోరాడ రమణ, నడిమింటి అప్పల్రాజు, బోధ రాజు, బోధ నారాయణ అప్పుడు, ఫోటోగ్రాఫర్ మూర్తి ,వైద్య సిబ్బంది సూర్యకళ,ఉమా తదితరులు పాల్గొన్నారు.

