రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు గిరిజనులను బలి చేయొద్దు.
విజయనగరం జిల్లా:
విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం రెల్లి రెవిన్యూ అప్పన్న దోర పాలెం పంచాయతీలో రాష్ట్ర విభజనలో భాగంగా గిరిజన యూనివర్సిటీ గత ప్రభుత్వం 2016 లో 526 ఎకరాల భూమిని కేటాయించారు అందులో స్థానిక గిరిజనుల వద్ద అప్పటి ప్రభుత్వం 160 ఎకరాలు భూసేకరణ చేసింది గత ప్రభుత్వంలో గిరిజనులకు భూమికి భూమి ఇస్తామని ప్రతి కుటుంబానికి మూడు సెంట్ల భూమిని ఇస్తామని అలాగే ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగా ఇంటి స్థలాలు ఇచ్చారు అలాగే ఐటీడీఏ నిధుల ద్వారా 50 లక్షల రూపాయల గిరిజనులకు భూమికి భూమి ఇవ్వటానికై జనరల్ క్లియరెన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఐదు కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించారు.ఇప్పటి ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ వేరే ప్రాంతం తరలిస్తామని వేరే ప్రాంతంలో భూసేకరణ కూడా చేశారు. యూనివర్సిటీ కి కేటాయించిన భూమిని ఏపీఐఐసీ వాళ్లకు అప్పగిస్తామని తెలియపరిచారు. మా గిరిజనలకి ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఎడల మీరు ఎవరికైనా భూమిని అప్పగించ వచ్చని తెలియజేస్తున్నాం ఈ విషయమై ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది

