ఏజెన్సీలోనే అతిపెద్ద అపరేసన్ ను పూర్తి చేసిన ఆంధ్ర రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్. తమర్భ నర్సింగరావు పాడేరు డాక్టర్లు బృందం.
పాడేరు జిల్లా:
పాడేరు జిల్లా హాస్పిటల్ లో.....ఆంధ్ర రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్. తమర్భ నర్సింగరావు పాడేరు డాక్టర్లు బృందంతో కలిసి ఏజెన్సీలోనే అతిపెద్ద అపరేసన్ ను పూర్తి చేశారు. బొర్రా గ్రామం దోనెలి పార్వతి (అరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్)w/o దానియేలు ఆమెకు గర్భాశయం లోపలి పెద్ద కాయలు ఏర్పడితే మూడు వారాల పాటు బాధపడుతూ వైజాగ్ ప్రైవేట్ ఆసుపత్రి కి తీసుకొని వెళితే ఆపరేషన్ కి రూ.1,50,000/- ఖర్చు అవుతుంది అన్నారు.
ఆమె దగ్గర అంత డబ్బులు లేక పాడేరు వచ్చి ఆంధ్రా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్. తమర్భ నరసింగారావు ని కలిస్తే పాడేరు జిల్లా హాస్పిటల్ లో చేర్పించి సోమవారం జిల్లా హాస్పిటల్ లోనే మొట్టమొదటి ఆపరేషన్ చేసి గర్భాశయంలో ఉన్న అతిపెద్ద తొలగించిన్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త దానియేలు ఆపరేషన్ చేసి మా భార్య ప్రాణం కాపాడినందుకు డాక్టర్కి అభినందనలు తెలిపారు.

