ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్న భూబకాసురులు

ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్న భూబకాసురులు....

గాజువాక :విశాఖ లోకల్ న్యూస్ 

గాజువాక 65వ వార్డ్ భానోజీ తోట, వాంబే


కాలనీ 86,87,274 సర్వే నెంబరులలో కొంతమంది దళారులు కొండవాలు ప్రాంతాలలో ఉన్న భూములను అక్రమించి రెవిన్యూ అధికారులు పాతిన బోర్డులు కూడా పడగొట్టి ఆ భూములును కొంతమంది వ్యక్తులకు అమ్ముతున్నారు....భూబకాసురలపై తక్షణమే చర్యలు తీసుకుని వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని  జిల్లా కలెక్టరుకు టీడీపీ  గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.  పార్టీ ఆదేశాలమేరకు ప్రభుత్వ భూముల సంరక్షణలో భాగంగా జీవీఎంసీ 65 వ వార్డులో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై నిరసన చేపట్టారు... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ప్రాంతాలలో ప్రభుత్వ భూములు భూభకాసురుల కబంధ హస్తలలోకి వెళ్లిపోయాయని విమర్శించారు. గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ 65 వ వార్డు సర్వే నెంబర్ 86, 274 లలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడిన అక్కడ కబ్జా దారులు క్షణాలలో ఆ భూములను మింగేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురౌతున్న ప్రజా ప్రతినిధులు కానీ సంబంధిత అధికారుల కానీ స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

 ప్రభుత్వ భూములు కబ్జాలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు.  ప్రభుత్వ భూములకు రక్షణ కలిపించాలని అలాగే కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాసరావు,మొల్లి పెంటి రాజు,నియోజకవర్గ ఇంచార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఎండి రఫీ, పార్టీ సీనియర్ నాయకులు గోమాడ వాసు, గాంధీ, తదితరులు పాల్గొన్నారు.