అయ్య బాబోయ్ గ్రామ సింహాలు.

అయ్య బాబోయ్ గ్రామ సింహాలు....

గాజువాక :విశాఖ లోకల్ న్యూస్ 


గాజువాక నియోజకవర్గం 68వ వార్డ్ రామ్ నగర్ లో వీధి కుక్కలు హల్చల్. సాయంత్రం ఆరు దాటితే చాలు ఆ రహదారిలో వస్తున్న పాదచారుల మీద, వాహనదారుల మీద దాడికి దిగుతున్నాయి అక్కడున్న గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పలుమార్లు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. నామమాత్రంగా సంవత్సరానికి ఒకసారి ఒకటో రెండో కుక్కలని పట్టుకు వెళ్తున్నారు. మిగిలిన కుక్కలన్నీ అక్కడే సంచరిస్తూ ఉంటాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా ఈ సమస్య మీద చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు