ప్రజలపై భారం మోపడం తగదు అంటున్న రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు


 మధురవాడ : విశాఖ లోకల్ న్యూస్

ప్రజలపై భారం మోపడం తగదు అంటున్న రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు 

జీవీఎంసీ జోన్ టు ఆరో వార్డు బక్కన్నపాలెం గ్రామం ఎన్టీఆర్ నగర్లో శనివారం సాయంత్రం ప్రస్తుత ఉన్న ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో  బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మాజీ సీనియర్ నాయకులు  పోతిన.ఎల్లం నాయుడు మరియు యువ నాయకుడు తెలుగు యువత పోతిన రఘు ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మరియు ఐ టిడిపి సభ్యుడు గొల్లంగి ఆనంద్ బాబు పర్యవేక్షణలో బాదుదే బాదుడు కార్యక్రమాలు నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు పాల్గొని  గడప తిరుగుతూ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రభుత్వ వైఫల్యాలపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి ఇచ్చి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలనను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా గొల్లంగి ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వారిపై అనేక రూపంలో బాదుడే బాదుడు రూపంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని అలాగే పెట్రోల్ గ్యాస్ నిత్యవసరుకుల పై అధిక ధరలు పెంచి ప్రజలను రోడ్డున పడేసే స్థితికి తీసుకొచ్చారని అలాగే శుక్రవారం వాహన మిత్ర పేరు మీద ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు చొప్పున వారికి ఇవ్వడం వారిని మోసం చేసినట్లు అవుతుందని పదివేలు వారి బ్యాంక్ అకౌంట్ లో వేసి వాహన రిపేర్లు ఖర్చుపై 20,000 వేలు తిరిగి మళ్ళీ రిపేర్లు రూపంలో వసూలు చేస్తున్నారు .వాహన మిత్ర పేరు మీద డ్రైవర్లకు 10,000 వేసే కన్నా నాణ్యమైన రోడ్లను అందిస్తే డ్రైవర్లకు అంతకన్నా సంతోషం ఏది ఉండదని గొల్లంగి ఆనందబాబు అభిప్రాయం తెలిపారు.

ఈ కార్యక్రమంలో,పోలిశెట్టి నాగేశ్వరావు, పిళ్ళా వెంకటేష్, అప్పలరెడ్డి, పోతిన పెంటయ్య,బంక వెంకట అప్పారావు ,గోలగాని సన్యాసి రావు, నక్క రమణ పోతిన సాధుబాబు తదితరులు పాల్గొన్నారు..


..