అవంతి చేతులు మీదుగా 98 వ వార్డు ఇళ్ళు పట్టాలు పంపిణీ

 అవంతి చేతులు మీదుగా 98 వ వార్డు ఇళ్ళు పట్టాలు పంపిణీ.

సింహాచలం:విశాఖ లోకల్ న్యూస్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్రతీ పేదవాడి సొంతింటి కల అయిన జగనన్న కోలనీ ఇళ్ళు పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం నాడు భీమిలి నియోజకవర్గం 98 వ వార్డు లో చేపట్టడం జరిగింది కార్యక్రమం లో బాగంగా అవంతి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ను ప్రారంభించారు. అనంతరం ఆయన కార్యక్రమం ను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో భీమిలి నియోజకవర్గం లో అర్హత ఉన్న జీవియంసి లో  30 వేల మంది - రూరల్ లో 10 వేల మందికి ఇళ్ళు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, 98 వ వార్డు లో 1400 మందికి ఇళ్ళు పట్టాలు ఇచ్చామని ఇందులో ప్రజాప్రతినిధులు గాని అదికారులు గాని పైసా లంచం తీసుకోకుండా పార్టీలు చూడకూండా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇవ్వడం జరిగిందని, పట్టాలు ఇస్తే సరిపోదని వారికి సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, స్కూలు అంగన్వాడీ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి జగనన్న కోలనీ పేరిట ఏకంగా ఒక ఊరే కడుతున్నారని ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే రెండో పేజ్ లో ఇవ్వవలసినదిగా సియం  ఆదేశాలు జారీ చేశారు అర్హత ఉన్న అందరికీ ఇవ్వడం జరిగుతుందని ఎవరూ పట్టాలు అమ్ముకోవద్దని పేదలకు సంక్షేమ పాలన అందిస్తున్న పేదల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు.అనంతరం 1400 మంది లబ్దిదారులు కు అవంతి శ్రీనివాసరావు చేతులు మీదుగా ఇళ్ళు పట్టాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కమిషనర్ యంఆర్వోఓ , కార్పోరేటర్ లు, వార్డు ప్రెసిడెంట్ లు, వివిధ కార్పోరేషన్ చైర్మన్ లు డైరెక్టర్ లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.