అనకాపల్లి కలెక్టరేట్ వద్ద కదంతొక్కన ఆశాలు.
అనకాపల్లి :
ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గౌరవ వేతనం 15వేలకు పెంచాలని, పనిభారాన్ని తగ్గించాలని, సంక్షేమపధకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్
ఇవ్వాలని, కోవిడ్ కాలంలో మరణించిన ఆశాల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్షియా ఇవ్వాలని మరియు ఇతర
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వఈ రోజు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఆశా వర్కర్ గౌరవవేతనం 15 వేలకు పెంచాలని కోరుతున్నాము. గత రెండున్నర సంవత్సరాల కాలంలో నిత్యావసర సరుకుల
ధరలు 300 రెట్లు పెరిగాయి. ప్రభుత్వం చెల్లిస్తున్న 10 వేలు వేతనం లో నెలకు 3 వేలరూపాయలు డ్యూటీ సమయంలో ఖర్చు చేయాల్సి
వస్తుంది. టిఎ డిఎలు చెల్లించటం లేదు. కోవిడ్ ప్రత్యేక అలవెన్స్ కూడా రాష్ట్రంలో చెల్లించటం లేదు.
కోవిడ్ డ్యూటీ లు ప్రారంభం నాటినుండి 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఆశా లకు పనిభారం ఎక్కువయింది.
టైమింగ్స్, సెలవులు లేవు. వర్క్ టెన్షన్ తో అనారోగ్యం పాలయి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారికి ఎటువంటి
ఎక్స్గ్రేషియో చెల్లించడం లేదు. ఆశాలకుసంబంధం లేని టెక్నికల్ వర్క్స్, కోవిడ్ టెస్ట్లు చేయటం, వ్యాక్సిన్ వేయడం, ఎన్సిడిసి సర్వేలు
చేయించడం లాంటి పనులు ఆశలతో చేయిస్తున్నారు. ఆశాలకు సంబందంలేని పనులు చేయిండం వలన తీవ్ర ఇబ్బందులకు గురవ్వటమే
కాకుండా ఆన్లైన్ పనివలన సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఆశా వర్కర్స్ గర్భవతులుగా ఉన్నప్పటికీ ప్రసవ సమయం వరకు డ్యూటీ చెయ్యాల్సి వస్తున్నది. మెటర్నటీ లీవ్ ప్రభుత్వం ఆశాలకు
వర్తింపచెయ్యటంలేదు. అనారోగ్యం పాలైన శెలవలు ఇవ్వడంలేదు. సిబ్బంది నిర్లక్ష్యం వలన ప్రాణాలు కోల్పోయిన రంపచోడవరం ఎజెన్సీ
ఆశా వర్కర్ సోమాలమ్మ కు న్యాయం చేయాలని కోరుతున్నాము.
ప్రభుత్వం నాసిరకమయిన సెల్ ఫోన్స్ సప్లై చేయటంతో పని చేసినా లెక్కింపుకురావడం లేదు. దేశంలో ఎక్కడా లేని పద్ధతిలో
మన రాష్ట్రంలో రిటైర్మెంట్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ అనకాపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి సత్యవతి , g వరలక్ష్మి ,గౌరవ అధ్యక్షులు రామలక్ష్మి ,సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ రూపా దేవి ,జీ.కోటేశ్వర రావు, వి వి శ్రీనివాస రావు తదితరులు నాయకత్వం వహించారు.

