పారి సుద్య కార్మికుల పై దాడిని కండిస్తు ధర్నా.
మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్
శాంతి యుతంగా తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ
మున్సిపల్ కార్మికులు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె ను నిర్భందం,దాడులతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ ఉద్గాటించింది.బుదవారం కార్మికులపై చేసిన పోలిసుల దాడిని నిరసిస్తు మధురవాడ జోనల్ కార్యాలయం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మధురవాడ 7వ వార్డు లో ధ్రోనం రాజు కాల్యన మండపం వాహనాల యార్డ్ వద్ద పోలీసులు, జోనల్ కమిషనర్, కార్మికులు పై చేసిన దాడి ని కండిస్తు జరిగిన ధర్నాలో ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించి, పెద్దపెట్టున నినాదాలు చేశారు. బుదవారం శాంతి యుతంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం పై జోనల్ కమిషనర్ కొంత మంది పారిశుధ్య కార్మికుల ను టార్గెట్ చేసి పోలీసులకు పిర్యాదు చేశారు.ఆవిధంగా కుట్ర పూరితంగా ప్రణాళిక ప్రకారం పోలీసులతో మొత్తం కార్మికుల పై నిర్భందం ప్రయోగించి, విచక్షణ రహితంగా ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. అదేవిధంగా 6వ వార్డు సాయి ప్రియ లేఅవుట్ రోడ్డు లో నిరసన కారులపై చేశారు.సాయి ప్రియ లేఅవుట్ లో మగ పోలీసులతో మహిళలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు పోలీసుల అత్యుత్సాహం కారణంగా తీవ్ర గాయాలు అయ్యాయి.సుమారు ఏడుగురి ముగ్గురు మహిళలతో సహా గాయాలు అయ్యాయి. 7 వ వార్డు కార్మికుడు వై చిన్న ను పోలీసులు కొట్టడం వలన తీవ్ర గాయాలు అయ్యాయి. పిట్సు వచ్చి స్పృహ కోల్పోవడం తో పాటు పాటు ఏడమచెయ్యి కి ఫాక్చర్ అవ్వడం వలన పి ఓ పి కట్టు వేశారు.రాత్రి 12 గంటల వరకు స్పృహ రాలేదు. ఈ కారణంగా కార్మికులు,కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. మరో మహిళతో సహ ఇద్దరు కార్మికుల కు చేతికి రక్త గాయాలు అయ్యాయి. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల ఇంత అమానుష దాడులను ప్రజలందరూ కందించాలని కోరారు.కార్మికుల పై దాడి చేసిన వారిపైన,కారకులైన వారి పైన న్యాయపరమైన చర్యలకు వెళతామని అన్నారు.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల జితాలలో కోతలు పెట్టి కొత్త చరిత్ర సృష్టించారని అన్నారు.సమస్యలు పరిష్కారము చేసే వరకు సమ్మె విరమించేది లేదని అన్నారు.శుక్రవారం వరకు చూసి సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి రజుకుమర్, డీ అప్పలరాజు, జీ.కిరణ్,కే నాగరాజు,జీ విజయ్, సీ హెచ్ శేషుబాబు,కే ఈశ్వరరావు జాన్, ఈశ్వరరావు,అప్పలకొండ,వి సంధ్య,తదితరులు పాల్గొన్నారు.

