జోన్-2 అసిస్టెంట్ సిటీ ప్లానర్గా ఎస్.శాస్త్రి సెహనాబ్ బాధ్యతలు స్వీకరణ
మధురవాడ,విశాఖ లోకల్ న్యూస్
జూలై 14: అంతర్గత బదిలీల్లో భాగంగా గుంటూరులో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఎస్.శాస్త్రి సెబినాను జీవీ ఎంసీకి బదిలీ చేశారు.
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ శా ఆదేశాల మేరకు జోన్ 2 అసిస్టెంట్ సిటీ ప్లానర్గా నియమించారు. కమిషనర్అదేశాలమేరకు జోన్ 2 ఏసీపీగా బాధ్యతలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రి సెహనాబ్ మాట్లాడుతూ జీవీఎంసీలో బాధ్యతలు నిర్వహించడం ఎంతో బాధ్యత తో కూడుకున్న పని అని తనకు కేటాయించిన బాధ్యత లు సక్రమంగా తోటి సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతములో ప్రణాళిక బద్దంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భముగా జోన్2 టిపివో తిరుపతిరావు, టిపిఎస్ జి.ప్రసాద్ సిబ్బంది కలిశారు.

