ఆనంద్ బాబు గొల్లంగి అద్వ్యర్యంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు


 మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

ఆనంద్  బాబు గొల్లంగి అద్వ్యర్యంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు

జీవీఎంసీ జోన్ టు 6వ వార్డ్ రేవాళ్లపాలెం లో ఐ టీడీపీ మెంబర్ మరియు స్టేట్ టీడీపీ బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఆనందబాబు గొల్లంగి అద్వ్యర్యంలో  గురువారం రేవాళ్లపాలెం న్యూ బీసీ కొలని లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం  కొత్తవి మరియు పాతవి సభ్యత్వం నమోదు చేసుకున్న  టీడీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ కొత్త మెంబర్షిప్ లు ఎక్కువుగా గురువారం చేశామని. అలాగే టీడీపీ మెయిన్ ఆఫీస్ లో సర్వర్స్ ఇంకా స్పీడ్ గా పనిచేసి నట్టాయితే భీమిలి టీడీపీ ఇంచార్జి కోరాడ రాజబాబు తనకి అప్పజెప్పిన టార్గెట్ ను త్వరగా పూర్తిచేసే వాడినని . ఏదీ ఏమైనా తను తన టీం వెళ్లిన ప్రతి చోట ,ప్రజలు టీడీపి మెంబర్షిప్ తీసుకోవడానికి, చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఐటీడీపీ మెంబర్ ఆనందబాబు గొల్లంగి.తెలిపారు.ఈ కార్యక్రమంలో పిల్లా వెంకటేష్ వార్డ్ సెక్రటరీ పొలిశెట్టి నాగేశ్వర రావు, జిల్లా నాయకులు పోతిన రఘు,స్థానిక టీడీపీ నాయకులు నాగోతి వెంకటరావు,పోతిన పెంటయ్య, బొడ్డేపల్లి.అప్పారావు,వాండ్రసి శ్రీనివాసరావు,శేఖర్,సిమ్మా ఎర్ణమ్మ,సత్తిబాబు నాయుడు పోతిన సందీప్,రెడ్డి శ్రావణి,లు పాల్గొన్నారు.