శ్రీ శ్రీ శ్రీ భూనీల సమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయములో శ్రీ మహాలక్ష్మి పూజ.
మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్
శుక్రవారం బాలాజీ హిల్స్ పై వెంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ భూనీల సమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయములో శ్రీ మహాలక్ష్మి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ పూజను కమిటీ చైర్మన్ సోమయాజుల సాయిలీల జరిపించి దీనికి అయ్యే ఖర్చు అంతా ఆమెనే భరించారని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క పూజను ఆమె సొంతంగా మొత్తం ఖర్చు ఆమెనే పెట్టుకొని జరిపిస్తున్నారు.మొదటి సంవత్సరము 9 మంది ముత్తయిదువులకు, రెండవ సంవత్సరం 18 మంది ముత్తైదువులకు మూడవ సంవత్సరం 27 మంది ముత్తైదువులకు ఈ నాల్గవ సంవత్సరము 36 మంది ముత్తైదువులకు వారిచే అమ్మవారికి అష్టోత్తరం, సహస్రనామం కుంకుమార్చన జరిపించి వారికందరికీ పసుపు, కుంకుమ, గాజులు మరియు చీరలు జాకెట్లు మొదలగు వస్తువులు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నారు . తదనంతరం పూజలో కూర్చున్న వారికే గాక మిగిలిన వారికి అందరికీ కూడా షడ్రుచులు తో భోజనము ఆలయ చైర్మన్ సాయి లీలా ఏర్పాటు చేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తం ప్రధాన పూజారి సంపత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయిలీల, ఎస్ ఎల్ మూర్తి, చక్రధర రావు, తదితర ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

