గుడ్ మార్నింగ్ సీఎం సార్ :జర రహదారులు చూడండి!
5,6,7వార్డులలో జనసేన డిజిటల్ క్యాంపెన్...గుంతలు పడ్డ రోడ్లు వద్ద నిరసన.
మధురవాడ :5,వార్డు గణేష్ నగర్ రహదారిలో ఎడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆరోవార్డులో జనసేన పార్టీ తలపెట్టిన డిజిటల్ క్యాంపెన్ ను నిర్వహించారు.
జీవీఎంసీ ఆరోవార్డు పోతిన అనురాధ ఆధ్వర్యంలో ఎస్సార్ నగర్ క్రికెట్ స్టేడియం వెనుక రహదారిలో,
7వ వార్డు ఈనాడు నాయుడు ఆధ్వర్యంలో కృష్ణనగర్ రామరాజు కల్యాణమండపం వెళ్లే రహదారిలో నిర్వహించిన కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ ముఖ్యఅతిగా పాల్గొని నిరసన తెలిపారు. గుంతలు పడ్డ రోడ్లు వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్బంగా గుంతలు పడ్డ రోడ్లపై గుడ్ మార్ఫింగ్ సీఎం సార్ అంటూ ముగ్గులు వేశారు.అనంతరం ఫ్లకార్డులు పట్టుకొని గుంతలు పడ్డ రోడ్లపై గుడ్ మార్నింగ్ సార్ అంటూ, జర రహదారులు చూడండి నినాదాలు చేశారు.వాహన మిత్ర పతకంతో డబ్బులు జమచేయ్యటం కాదు, అదే వాహనంలో క్షేమoగా గమ్యం చేరే రహదారులు మరమ్మత్తులు చెయ్యండి సారు అంటూ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన ఆరో వార్డు ఇంఛార్జ్ సంతోష్ నాయుడు,వాండ్రాసి శ్రీను,5,6,7 వార్డుల జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




