5వ వార్డు లో కల్వర్టు రోడ్లు నిర్మాణము పనులకు శంకుస్థాపన
మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్
గురువారం 5వ_వార్డు నగరం పాలెం స్వతంత్ర నగర్ రాజీవ్ గృహకల్ప లో మన 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో జీవీఎంసీ ₹150 లక్షల నిధులలో ₹45 లక్షలతో డ్రైనేజీలు మరియు కల్వర్టు రోడ్లు నిర్మాణము పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమిలి శాసనసభ్యులు ముత్తంసెట్టి శ్రీనివాసరావు మరియు 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత చేతులు మీద శంకుస్థాపన కార్యక్రమం చేయబడింది. ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.

