అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన జె. సత్య కుమారి ఉత్తమ కౌన్సిలర్ గా ఎంపిక.
అక్కిరెడ్డిపాలెం:
విశాఖ గోశాల హాస్పిటల్ లో కౌన్సిలర్ గా విధులు నిర్వహిస్తున్న అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన జె. సత్య కుమారి ఉత్తమ కౌన్సిలర్ గా ఎంపికయ్యారు ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున చేతుల మీదుగా ఆమె ప్రశంసాపత్రం ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందుకున్నారు ఈ సందర్భంగా సత్య కుమారి మాట్లాడుతూ ఈ పురస్కారంతో తనపై బాధ్యతలు ఇంకా పెరిగాయని తన సేవలను గుర్తించి ఉత్తమ కౌన్సిలర్ గా ఎంపిక చేయడం ఆనందంగా ఉందని అన్నారు తమ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు తమ తోటి సిబ్బందికి జిల్లా కలెక్టర్ మల్లికార్జున కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

