టీడీపీ ఆధ్వర్యంలో ఎర్రమట్టి దిబ్బలు లో నిరసన


 భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

టీడీపీ ఆధ్వర్యంలో ఎర్రమట్టి  దిబ్బలు లో నిరసన 

 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ  ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎర్రమట్టి దిబ్బలు లో నిరసన కార్యక్రమం భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు  మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలనకు నిదర్శనం ఈ కొండలను ఎర్రమట్టి దెబ్బలను చూస్తే అర్థమవుతుందని ఎన్నో ఏళ్లుగా ప్రాధాన్యత పొందిన ఎర్రమట్టి దెబ్బలు సైతం ఈ భూ బకాసురులు తినేస్తున్నారని వీరి ఆకలికి కొండా గుట్ట తేడా లేదని కొండలను సైతం చెరువులు తలపించే విధంగా తవ్వేస్తున్నారని చెరువులను ఆక్రమించేస్తున్నారని ఇది ముమ్మాటికి వినాశనానికి దారితీస్తుందని ప్రకృతిని ప్రేమించలేని వ్యక్తి అత్యంత పాసవికంగా ఉంటాడని వారి ఆలోచన శైలి అతి క్రూరంగా మారిపోతుందని ప్రకృతిని కాపాడుకున్న నాడే మానవాళి మనుగడకు ఒక అర్థం ఉంటుందని ప్రకృతిని ప్రజలని ఎవరిని విడిచిపెట్టకుండా రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాల నాశనం చేస్తున్నారని తెలియజేస్తూ అక్రమ తవ్వకాలను నిలిపివేసి ప్రకృతిని కాపాడాలని భీమిలి తెలుగుదేశం పార్టీ తరఫున ఇంచార్జ్ కోరాడ రాజబాబు  నిరసన తెలియచేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మూడో డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి గోడి అరుణ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ విశాఖ పార్లమెంట్ సెక్రెటరీ సరగడ అప్పారావు విశాఖపట్నం అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాస్ విశాఖపట్నం ప్రధాన కార్యదర్శి పిట్ట సురేష్ విశాఖ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్రెడ్డి రమేష్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి సీనియర్ నాయకులు బోయి వెంకటరమణ పద్మనాభం మండల అధ్యక్షులు కోరాడ రమణ నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు పాసి త్రినాథ్ కుమార్, దంతులూరి సిద్ధార్థ వర్మ సీతాపతి రవి కనకల అప్పలనాయుడు మారోజు సంజీవ్ కుమార్ గరే గురునాథ్ మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది