బొండపల్లి దేవి నాయకత్వంలో జనసేన నాయకులు గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపైన్.
తగరపువలస :విశాఖ లోకల్ న్యూస్
జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాన్ ఆదేశాలు మేరకు భీమిలి నియోజకవర్గం మహిళ నాయకురాలు. బొండపల్లి దేవి నాయకత్వంలో తగరపువలస ఎస్ ఎమ్ ఎల్ ఫంక్షన్ హాల్ రోడ్ నందు #గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపైన్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జగన్ సర్కార్ వారికి ఆంధ్రప్రదేశ్ రహదారి ల దుస్థితిని తెలియ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుడివాడ కిరణ్, రాజు నవిరి, రామోజీ సతీష్, కొయ్య శ్రీను, గోపి, పాసి శ్రీను, నాగేశ్వర్, జనసైనికులు పాల్గొన్నారు.


