చోడవరం మండలం, రేవళ్లు గ్రామం లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణ

చోడవరం మండలం, రేవళ్లు గ్రామం లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణ.

అనకాపల్లి జిల్లా :చోడవరం మండలం :రేవళ్లు గ్రామం.


చోడవరం మండలం, రేవల్లు గ్రామం లో యువకులు, పెద్దలు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దుంగల గణేష్  మాట్లాడుతూ రేవళ్లు  టైగర్స్ అందరికీ నమస్కారం. ఇంతవరకూ ఊర్లో అందరూ కలిసి చేసిన కార్యక్రమాల లో ఎంటర్టైన్మెంట్ వుండేది.అబ్బా..మన రేవళ్లు వచ్చినందుకు చాలు మనవరకు ఏదో ఎంజాయ్ చేశాం అనిపించేది.


కానీ శనివారం మన గ్రామంలో మొక్కలు నాటిన కార్యక్రమం భవిష్యత్ లో మన భావితరాలవారికి ఉపయోగం కల్గించే విధంగా ,ఒక మంచి కార్యక్రమం నిర్వహించే సందర్భంలో మన గ్రామ ప్రజల యొక్క ఐక్యతను,మరియు అందరూ కలిసికట్టుగా భాగస్వామ్యం ఏర్పరచుకునే మంచి పద్ధతి లను ఈ రోజు మనల్ని చూసి రేపటి తరాలు అలవర్చు కునే విధంగా నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయం.రేపటి రేవళ్లు తరానికి మన ప్రస్తుత రేవళ్ల టైగర్స్ అందరి పేర్లు గుర్తు వుండే విధంగా..ఇంత గొప్ప మహోన్నత కార్యక్రమం నిర్వహించిన ,మరియు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్న అదృష్టవంతులు అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు తెలియచేసారు.