మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
మున్సిపల్ కార్మికుల సమ్మె గోడ పత్రిక విడుదల
జులై 11 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు,ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పై అఖిలపక్ష కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నామని జి వి ఎం సి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ప్రసాదరావు తెలియజేశారు.
ఈసందర్భంగా ముద్రించిన గోడ పత్రిక బుధవారం జోనల్ కార్యాలయం వద్ద విడుదల చేశారు.ప్రసాదరావు మాట్లాడుతూ ఈ సమ్మె కార్మికులు, ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక సంఘాలు ఐక్యంగా చేస్తున్నామని తెలిపారు.ఈసమ్మేకు ప్రజలందరూ సహకిరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ ప్రధాన కార్యదర్శి పీ రాజ్ కుమార్,యూనియన్ నాయకులు జీ కిరణ్,కే రాజు,వి సంధ్య,కే పైడిరాజు,వై చిన్న, జి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

