ఆర్టీసీ చార్జీల పెంపు దారుణం: కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్.
ఆనందపురం:
ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చార్జీలు పెంచడం దారుణమని టిడిపి యువ నాయకుడు,వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అధిక ఛార్జీలు బాదుడుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా దినసరి కూలీలకు శిరోభారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సైతం ఈ చార్జీల పెంపు ప్రభావం తీవ్రంగా చూపిస్తోందన్నారు. క్షణమే చార్జీల పెంపుదలను విరమించుకోవాలని ఆయన కోరారు. అన్నింటిపై బాదుడే బాదుడు గా తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావని ధ్వజమెత్తారు. సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు ప్రజలకు ఇకట్ల కు గురి చేస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పాలన అందిస్తే బాగుంటుందని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

