ఘనంగా జగన్నాథ స్వామి రథోత్సవం.
76వ వార్డ్ పెదగంట్యాడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన జగన్నాథ స్వామి ఆలయం వద్ద స్వామివారి రథోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రథోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి, 76వ వార్డు వైఎస్ఆర్సిపి ఇంచార్జ్, శ్రీశ్రీశ్రీ పరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయ ట్రస్టీ మెంబర్ దొడ్డి రమణ విచ్చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. దశావతారాలు అలంకరణలతో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. హౌసింగ్ బోర్డ్ నడుపూరు ప్రాంతమంతా తిరిగి భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో పీతాంబరిదాస్, తాటికొండ జగదీష్,కాకినాడ పెంట రావు, బ్రహ్మానంద రెడ్డి, మురళీ,పత్రి దేవి,మంగ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

