మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మహోత్సవములు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మహోత్సవములు.

విశాఖ లోకల్ న్యూస్:

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మహోత్సవములు సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆదేశాలు మేరకు విశాఖ జిల్లా చిరంజీవి యువత  ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించే గొప్ప ఆలోచన తో ప్రతి మెగా అభిమాని ఇంటి ముందర  మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ లో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమాని యడ్ల లక్ష్మణ్ యాదవ్ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం శ్రీకారం చుట్టారు, ముందు గా శ్రీకృష్ణ స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి మా అభిమానులు దేవుడు మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో  ఆరోగ్యంతో ఉండాలి అని కోరుకుంటు పూజలు చెయ్యడం జరిగింది, శ్రీకృష్ణ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో స్వామి వారిని స్మరించుకుంటూ మొక్కలు నాటడం జరిగింది ఈ మహోన్నత కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కోయిలడా శ్రీనివాస్ చిరంజీవి సీనియర్ అభిమాని యడ్ల లక్ష్మణ్ యాదవ్, వై సదా విశాఖ జిల్లా చిరంజీవి ఫాన్స్ అధ్యక్షుడు వి ఎల్లజీ రావు, ఉపాధ్యక్షులు పెనుమాత్స మధు ,ప్రధాన కార్యదర్శి లంక శ్రీనివాస్ సోషల్ మీడియా అధికార ప్రతినిధి యడ్ల గణేష్ యాదవ్,మీడియా వింగ్ ప్రతినిధి ప్రశాంత్ మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు.