ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ సీపీఎం ధర్నా

 ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ సీపీఎం ధర్నా

మధురవాడ :

నివాస ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల తో పాటు ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో, హుధూద్ ఇళ్ళు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జి వి ఎం సి జోన్ 2 కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ప్ల కార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ ధర్నాను ఉద్దేశించి మధురవాడ జోన్ కార్యదర్శి డీ అప్పలరాజు మాట్లాడుతూ టిడ్కో ఇల్లు నిర్మాణం చేసి అన్నిసౌకర్యాలతో ఉచితంగా మీకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి సుద్దగెడ్డలో రజకుల ఇండ్లు తొలగించి నిరాశ్రయులను చేశారని అన్నారు. నేటికీ నాలుగు సంవత్సరాలు అయిన ఇప్పటి వరకు ఇండ్లు అప్ప చేప్పలేదని 
ఇది చాలా అన్యాయమని అన్నారు.అరిలోవ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇల్లు స్థానికులకు ఇవ్వకుండా దబ్బందలో ఇస్తామనడం సరైందికాధని ఆ ఇండ్లు స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ప్రకటించిన విధంగా టిడ్కో లబ్ధిదారులు కట్టిన డీ డీ లు ద్వారా కట్టిన సొమ్ము తిరిగి ఇప్పించాలని కోరారు. స్వయంకృషి నగర్ లో 12 అడుగుల సి సి రహదారి కి వున్న ఆటంకాలు తొలగించి వెంటనే రహదారి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తీసుకొచ్చిన పన్నుల విధానం లో మార్పులకు సంబంధించిన జి వో లు 196,197,198 నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మరిక వలస శారద నగర్ కొండ పైన త్రాగు నీటికి టాంక్ నిర్మించి త్రాగు నీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం జోనల్ కమిషనర్ బి రాము కి వినతి పత్రాలు సమర్పించారు.ఈకార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ నాయకుల వి  నరేంద్రకుమార్,సీపీఎం నాయకులు బీ భారతి, డి కే శారద, రజక సంఘం నాయకులు చంటి, ఏ గురుమూర్తి రెడ్డి, కే మని, బి సంతోషి,గణపతి,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.