7వ వార్డు లో జనసేన క్రియాశీల కిట్లు పంపిణి విజయవంతం చేయాలి.

7వ వార్డు లో జనసేన క్రియాశీల కిట్లు పంపిణి విజయవంతం చేయాలి.            మధురవాడ :

జీవీఎంసీ ఏడవ వార్డు పరిధిలోని జరిగే క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ వార్డ్ సీనియర్ నాయకులు ఈనాడు నాయుడు, పిళ్ళా శ్రీను తెలిపారు.3వ తేదీ ఆదివారం జరిగే జనసేన సభ్యత కిట్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు నాయకులు తప్పకుండా హాజరై కావాలని తెలిపారు. ఏడవ వార్డు పరిధిలోని దుర్గా నగర్ లో ఆర్. డి కళ్యాణ మండపం లోని ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. వార్డు లో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడుతన సభ్యత్వ కిట్టు ను అందుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల తో పాటు జిల్లా నాయకులు పాల్గొంటారని ఈనాడు నాయుడు, పిళ్ళా శ్రీను లు తెలిపారు.