రెండు లారీలు ఢీ - కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సబ్బవరం విశాఖ లోకల్ న్యూస్ : సబ్బవరం సమీపంలో అసకపల్లి వద్ద అనకాపల్లి వైపు వెళ్తున్న లారీ ని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీ కొట్టడంతో ఇరు వాహనాల డ్రైవర్, క్లినర్ లకు గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన రోడ్డు సింగిల్ రోడ్డు కావటం వలన రోడ్డు పై వాహనాలు భారీగా దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఉదయం సమయం కావటం వలన విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

