ఈ-శ్రమ కార్డులను లబ్దిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి: కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రావు


 ఈ-శ్రమ కార్డులను లబ్దిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి: కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రావు

భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

ఆనందపురం మండలం వేములవలస గ్రామపంచాయతీలో మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయంతో ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్ నిరుపేదలకు ఇ-శ్రమ కార్డులు తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవీన్ జ్ఞానేశ్వర్ రావు మాట్లాడుతూ ఇ-శ్రమ కార్డులను లబ్దిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు లబ్ధిదారుడు ప్రమాదంలో 90% వైకల్యం చెందితే  లక్ష రూపాయలు భీమ వర్తిస్తుందని అదే ప్రమాదంలో మనిషి మరణిస్తే రెండు లక్షలు ప్రమాదం భీమ వర్తిస్తుందని ఆయన  తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు నడిమింటి అప్పలరాజు, కోరాడ రమణ బోధ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.