ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్ర ప్రదేశ్.కాకినాడ జిల్లాలో సభ్యత్వం మరియు ర్యాలీ.
కాకినాడ :
ఆదివారం జరిగినటువంటి కాకినాడ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర మహిళా కన్వీనర్ శీతల్ మదన్ జిల్లాకి విచ్చేసిన సందర్భంగా. నూతన సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఇందుకుగాను 100 మంది వాలంటీర్లు పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా జాతీయ పురస్కార గ్రహీత మరియు సామాజిక కార్యకర్త అయినటువంటి మేడిశెట్టి రామ్మోహన్ (రాంబాబు) పార్టీ సభ్యత్వం మర్యాదపూర్వకంగా తీసుకోవడం జరిగింది. ఇందుకు జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్కు మరింత బలం చేకూరడం చాలా గర్వకారమని శీతల మదన్ కొనియాడారు. విధంగా కాకినాడ పట్టణంలో జరిగినటువంటి ర్యాలీకి మంచి స్పందన రావడం కూడా జరిగింది. ఈ యొక్క ర్యాలీ మరియు కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు నూతన వాలంటీర్లు వందలాదిగా హాజరవడం జరిగింది తోట ఎల్లాజీ రావు (జిల్లా కోఆర్డినేటర్ మరియు మీడియా ఇంచార్జ్)ఆమ్ ఆద్మీ పార్టీ విశాఖపట్నం జిల్లా అని అన్నారు.

