బొండపల్లి లో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మిక తనిఖీ.
(విజయనగరం జిల్లా )బొండపల్లి :-
మండల కేంద్రమైన బొండపల్లి లో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల ద్వారా గర్భిణీలకు,చిన్నారులకు క్రమంతప్పకుండా పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ అధికారులు ను ఆదేశించారు. ప్రజా ఆరోగ్యం పై దృష్టి సారించాలని వైద్యాధికారులకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఆరోగ్య మిత్ర లకు కలెక్టర్ సూచించారు. అలాగే పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతి కుమారి, తాసిల్దార్ శ్రీనివాసు మిశ్రా, ఎంపీడీవో పాండ్రంకి త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.