ఇళ్లు బిల్లులు ఇప్పించాలి. జనంకోసం సిపిఎం కార్యకర్తలు ప్రదర్శన.
(విజయనగరం జిల్లా) మెంటాడ:-
మండలంలో కూనేరు గ్రామంలో బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం సిపిఎ-ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గిరిజన సంఘ సభ్యులు, సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.గ్రామస్తులు తెలిపిన సమస్యలను విన్న సిపిఎం పార్టీ మండలశాఖ కార్యదర్శి రాకోటి రాములు అద్యక్షతన గ్రామ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈసంధర్భంగా రాములు మాట్లాడుతూ గ్రామంలో పదిమంది వరకు పక్కాఇళ్లు నిర్మాణం చేపట్టారు.అరకొరగా బిల్లులు చెల్లించి మిగతా బిల్లులు చెల్లింపులు చేయలేదని గిరిజన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన డిమాండ్ చేసారు.అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా తొమ్మిది వారాలు పనులు చేయగా కేవలం రెండు వారాలు మాత్రమే చెల్లించారు. మిగిలిన ఏడు వారాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు అర్హులైన గిరిజనులకు భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.గతంలో అక్రమాలకు పాల్పడిన బిసి అభ్యర్థి కి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును ఇవ్వడం పట్ల పలుమార్లు ధర్నా లు, జిల్లా కలెక్టర్,డుమా ప్రాజెక్టు అధికారికి విన్నవించడం జరిగిందని ఆయన అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో గిరిజనులకు అన్యాయం జరుగుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర చొరవ చూపక పోవడం అమానుషం అని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంలో మంత్రివర్యులు రాజన్నదొర స్పందించి గిరిజన సమస్యలను, గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.బిసి అభ్యర్థి కిచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ నియామక ఉత్తర్వులు రద్దుచేసి అర్హులైన గిరిజన అభ్యర్థి కి ఇప్పీంచాలని ఆయన డిమాండ్ చేసారు.అనంతరం సచివాలయ సిబ్బందికి సమస్యలతోకూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈకార్యక్రమంలో గిరిజన సంఘ జిల్లా సహాయ కార్యదర్శి తామారాపల్లి సోములు,గ్రామ ఉపసర్పంచ్ చిలక సన్యాసిరావు,గ్రామ పోరాట సమితి నాయకులు తాడ్డి రామకృష్ణ,చిన్నారావు,మాజీ ఉపసర్పంచ్ పొదిలాపు గంగయ్య తదితరులు పాల్గొన్నారు.