ఇసుక స్టాక్ పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్యే శంబంగి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీల్లో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలు కోసం కావలసినంత ఇసుకను ఉచితంగా పంపిణీ చేయాలనే సదుద్దేశంతో ఇళ్ల నిర్మాణానికి ఇసుక అవసరం ఎంతైనా ఉన్నందున లబ్ధిదారుల సౌకర్యార్ధం బొబ్బిలి ఐటిఐ కాలనీ వద్ద ఉన్న పాత హౌసింగ్ బోర్డ్ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్ ను స్థానిక శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రారంభించారు.ఈ స్టాక్ పాయింట్ నుంచి లబ్ధిదారులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు అవసరమైన పత్రాలను ఆయన లబ్ధిదారులకు అందించారు. బొబ్బిలి మండల పరిధిలో ఇళ్ళు నిర్మించుకునే లబ్ధిదారులంతా ఇక్కడి నుండి ఇసుకను ఉచితంగా పట్టుకొని వెళ్లి ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు.